సూపర్ స్టార్ మహేష్ బాబు రిపబ్లిక్‌డే సందర్భంగా అభిమానులకు మంచి కానుక ఇచ్చాడు.ఓత్ పేరిట రీలిజ్ చేసిన ఆడియోలో మహేష్ బాబు వాయిస్ చాలా పవర్ ఫుల్‌గా ఉంది.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.మహేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నట్లుగా ఉన్న ఆడియోను రిపబ్లిక్‌డే సందర్భంగా విడుదల చేశారు. సమకాలీన రాజకీయ అంశాలపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు కొరటాల శివ సోషల్ మీడియా వేదికగా తెలిపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయలను టార్గెట్ చేసి ఈ సినిమా తీసిన్నట్లు తెలుస్తుంది.
ఈ ఆడియోలో మహేష్ బాబు ‘ భరత్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాకర్తవ్యాలను శ్రద్దతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగా కాని, పక్షపాతంగా కాని, రాగద్వేశాలు లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అంటూ మహేష్ చేప్పిన తీరు అభిమానులను అలరించింది.
Here you go. Bharath takes his First Oath!https://t.co/CniSNf3CuZ#BharathAneNenu
— Mahesh Babu (@urstrulyMahesh) January 26, 2018