Saturday, May 3, 2025
- Advertisement -

మైత్రీ మూవీ మేకర్స్‌కు షాక్

- Advertisement -

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు మరో షాక్ తగిలింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, నటుడు రిషబ్ శట్టి లపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు పోలీసులు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న జై హనుమాన్ చిత్రంపై నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసు దాఖలు చేశారు న్యాయవాది మామిడాల తిరుమల్ రావు. జై హనుమాన్ చిత్రం టీజర్ హనుమంతుడిని కించపరిచే విధంగా ఉందని.. గత సంవత్సరం 2024 అక్టోబర్ 30న విడుదలైన టీజర్లో హనుమంతుని ముఖచిత్రం బదులు నటుడు రిషబ్ శెట్టి మొహం చూపించారని అభ్యంతరం వ్యక్తం చేశారు న్యాయవాది మామిడాల తిరుమల్ రావు.

భవిష్యత్ తరాలకు హనుమంతుడు అంటే ఎవరో అని గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుందని.. హిందువుల మనోభావాలను దెబ్బతింటాయన్నారు. దీనికి బాధ్యులుగా చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, నటుడు రిషబ్ శట్టి లపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -