బిగ్‌బాస్ రెండో సీజన్ చివరి దశకు చేరడంతో షో మరింత ఆసక్తికరంగా మారింది. బుధవారం జరిగిన ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగింది.కౌశల్ మాట్లాడుతు నాపై కుక్కల్లా పడతారు అనడంతో మిగత ఇంటి సభ్యులందరు కౌశల్‌పై విరుచుకుపడ్డారు.మమల్ని కుక్క అంటావా అంటు కౌశల్‌పై ముకుమ్మడి దాడి చేశారు ఇంటి సభ్యులు.రోల్ రైడా ఓ అడుగు ముందుకేసి తనలోని నట విశ్వరూపాన్ని బయటపెట్టాడు.ఇక తాజాగా గురువారం ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు బిగ్‌బాస్.ఇంటి సభ్యులకు మరో టాస్క్ ఇచ్చారు.రేస్ టూ ఫైనల్ లెవల్ 2 టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్.
హౌస్‌మెట్స్‌కు మీ గూడ్లు జాగ్రత్త అనే టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్.పోటీదారులకు గూడ్లు ఇచ్చి వాటిని కాపాడుకోవాలి.ఈ టాస్క్‌లో రోల్ రైడా,సామ్రట్‌లు గూడ్లును కాపాడుకోవాలి.మిగిలిన ఇంటి సభ్యులు ఆ గూడ్లను పగలకొట్టాలి. ప్రోమోని చూస్తుంటే కౌశల్ ఒక్కడే గూడ్లు పగలకొట్టినట్లు కనిపిస్తుంది.ఇక రోల్ రైడా వంట గదిలోకి వెళ్లి గూడ్లను దాచడం కనిపించింది.మరి ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులు ఇంకెన్ని గొడవలు పడతారో చూడాలి.