టాలీవూడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం బ్రహ్మోత్సవం. ఈ సినిమా ఈ నెల 20న భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమపై ప్రముఖ జర్నిలిస్ట్, దూబాయ్ సెన్నార్ బోర్డ్ మెంబర్ ఉమర్ సాంధు ఈ సినిమాపై ఎక్స్ క్లూజివ్ రివ్వూని అందించాడు.
సినిమా చాలా బాగుందని, మహేష్ బాబు నటన మరియు గ్లామర్, అలాగే సినిమాటోగ్రాఫీ ఈ చిత్రాన్నికి మంచి ప్లస్ అని చెప్పాడు. అంతేకాకుండా, శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ చాలా బాగుందని, ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో అర్టీస్టుల నటన మైండ్ బ్లోయింగ్ గా ఉందని చెప్పాడు. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని అలాగే మహేష్ నటనకు ఈ చిత్రం ఎన్నో అవార్డులను తెచ్చిపెడుతుందని అన్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రమని పొగడ్తలతో ముంచెత్తాడు.
సాంగ్స్ సినిమాలో చాలా బాగున్నాయని, క్లాసికల్ సినిమాలో స్టంట్స్ కూడ అద్భుతంగా ఉన్నాయని అన్నాడు. అందరూ చూడాల్సిన సినిమాగా చెప్పి సినిమాకి 5/5 ఏకంగా రేటింగ్ ని కూడా ఇచ్చాడు. ఇండియన్ సినిమా మ్యాగజైన్ కు ఎడిటర్ అని చెప్పుకునే ఈ ఉమర్ బ్రహ్మోత్సవం సినిమా సూపర్ అని, మహేష్ కెరీర్ లోనె ది బెస్ట్ సినిమా అంటున్నాడు. ఈ ఉమర్ గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కూడా సూపర్ అని బ్లాక్ బస్టర్ అని అన్నాడు. అదేమో డిజాస్టర్ అయింది. సరైనోడు కూడా సూపర్..బ్లాక్ బస్టర్ అన్నాడు. సరైనోడు విషయంలో కరెక్ట్ గా జరిగింది.