ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభుదేవాపై కేసు నమోదైంది. అయితే ఇది ఇండియాలో కాదు..ప్రభుదేవా మీద కేసు అమెరికాలో నమోదు అయింది.అమెరికాలో ప్రదర్శన కోసం ప్రభుదేవాతో ఒప్పందం చేసుకుంది ఓ సంస్థ. ఆ సంస్థ నుండి పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు ప్రభుదేవా.అయితే అనుకొని కారణల వల్ల ఆ ఈవెంట్ రద్దు కావడంతో వారు ఇచ్చిన డబ్బు వెనక్కి తిరిగివ్వలని అమెరికా సంస్థ కోరింది.
దీనికి ప్రభుదేవా నుండి సమాధానం రాకపోవడంతో వారు కేసు నమోదు చేసినట్లు సమాచారం.అయితే ఈ ఫిర్యాదలో ఒక్క ప్రభుదేవా పేరు కాకుండా బాలీవుడ్ స్టార్స్ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం.సల్మాన్ ఖాన్ ,కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, రణ్‌వీర్ సింగ్ వీళ్ల మీద కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. వీళ్లందరు కూడా షో చేస్తామని చెప్పి అడ్వాన్స్ తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని వీరి మీద ఫిర్యాదు చేసింది సదరు అమెరికాకు చెందిన సంస్థ.