లోకరక్షకుడు ఏసుక్రీస్తు జననం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో క్రిస్మస్ సందడి నెలకొంది. చర్చిలను విద్యుత్ కాంతులతో అత్యంత సుందరంగా అలంకరించారు. దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. క్రైస్తవులే కాక హిందువులు కూడా ఈ పండుగని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకుంటున్నారు.

క్రిస్మస్ వేడుకని టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు జరుపుకుంటూనే తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు తమ ట్విట్టర్ ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ మీ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అని తెలిపారు.

ఇక బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన భార్య జయా బచ్చన్, కొడుకు, కోడలు, మనవరాలుతో కలిసి క్రిస్మస్ వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. వేడుకకి సంబంధించిన ఫొటోలు నవ్వ నందా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అవి ఫుల్ వైరల్ అవుతున్నాయి. అంతే కాదు పలువురు సెలబ్రెటీలు, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.