తెలుగు ప్రేక్షకుడి అభిరుచి మారింది. ఒక ప్రాస, యాస్ తో….. ఓ డైలాగ్ చెప్పేస్తే… కథలో ఏముందిలే అని చెప్పి… గతంలో ఆ డైలాగ్ కోసం సినిమాలను చూసిన సందర్బాలున్నాయి. కాని ఇపుడు ఆ సీను ,సినిమా రెండూ మారిపోయాయి.
ప్రాస కాదు బాబు…. కథ కావాలంటున్నారు.అలా ఉంటేనే ఆదరిస్తామంటున్నారు.డైలాగ్స్ వినడానికి సెటైరిక్ గా మలచుకోవడానికి మా దగ్గర డబ్ స్మాష్ లు చాలానే ఉన్నాయంటున్నారు.ఎటొచ్చి కథ చెప్పే నాదుడే లేడని అభిమానులు తెగ బాధపడుతున్నారు.
రీసెంట్ గా మాటలతో మాయ చేసే సినిమాలకు చెక్ పెట్టి..మాంచి కథా చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడమే దీనికి చక్కని ఉదాహరణ. తెలుగులో కేవలం మాటలతోనే బతికేసే త్రివిక్రమ్ ,సీపాన శ్రీదర్ ,మచ్చరవి,కోన వెంకట్ అండ్ టీం కు రోజులు దగ్గర పడిపోయాయి. వీరిలో కోన వెంకట్ ఒక్కడే…. తెలివిగా కథ విషయంలో దర్శకులకే పెత్తనం ఇచ్చేసి డైలాగ్స్ వరకు గోపీ మోహన్ తో కలిసి పంచ్ లిచ్చేస్తున్నాడు.
ఇక త్రివిక్రమ్ గురించి సన్నాఫ్ సత్యమూర్తి తరువాత మాట్లాడుకోవడం కూడా మానేశారు.కథ రాయకుండా ప్రాస రాస్తాను చూడమంటే ఎలా. అందుకే కాబోలు డైలాగ్ లో పంచ్ ఉన్నా లేకపోయిన కథలో జీవం ఉంటే చాలనే రోజులు మళ్ళీ వచ్చేశాయి.విజయేంద్ర ప్రసాద్ ,కొరటాల శివ,క్రాంతి మాధవ్ ,దేవ కట్టా,ఏలేటి చంద్రశేఖర్ లాంటి వారు మాత్రమే ఈ విషయంలో కాస్త మెచ్యూర్ గా ఉన్నారు.అందుకే ఎల్ల వేళలా వీరు చేసే సినిమాలకు నిత్యం ఆదరణ లభిస్తూనే ఉంది.