ఇంటి దొంగ‌ చెన్న‌య్య‌పై స్పందించిన చిరు..

- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో దొంగతనం జరిగింది. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఆయన ఇంట్లో రూ. 2 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు చిరంజీవి మేనేజర్‌ గంగాధర్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనేజరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన సంగ‌తి తెలిసిందే.

తన నివాసంలో జరిగిన చోరీపై చిరంజీవి‍ మొద‌టి సారిగా స్పందించాడు. నిందితుడు చెన్నయ్య తమ కుటుంబానికి నమ్మకంగా ఉండేవాడని అన్నారు. తమ కుటుంబసభ్యుల్లో ఒకడిగా ఉండేవాడని, ఇంట్లో జరిగే అన్ని వేడుకల్లోనూ పాల్గొనేవాడన్నారు. అలాంటిది సొంత మనిషిలా చూసుకున్నా.. నమ్మకాన్ని పోగొట్టుకున్నాడని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. చిరంజీవి కుటుంబసభ్యుల గ్రూప్‌ ఫొటోల్లో కూడా చెన్నయ్య ఉండటం గమనార్హం. చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యుల సినిమా ఫంక్షన్లకు కూడా చెన్నయ్యను ప్రత్యేకంగా తీసుకెళ్లేవారని సమాచారం.

- Advertisement -

కాగా చిరంజీవి ఇంట్లో నగదు చోరీ చేసిన చెన్నయ్యను జూబ్లీహిల్స్‌ పోలీసులు నిన్న అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. నిందితుడి నుంచి రూ. 1.50 లక్షల నగదు రికవరీ చేశారు. ఆర్ధిక అవసరాల కోసమే తాను నగదు చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. చోరీ సొత్తులో రూ. 50 వేలు ఇంటి ఖర్చులకు వాడుకున్నాడని మిగతా డబ్బును ఇంట్లోనే భద్రంగా ఉంచినట్లు తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -