Tuesday, May 6, 2025
- Advertisement -

మెగా అభిమానులకు పండగా లాంటి వార్త!

- Advertisement -

ఇది నిజంగా మెగా అభిమానులకు పండగా లాంటి వార్తే. ఎందుకంటే తన 150 వ సినిమా ఎలా ఉండబోతుందో అలాగే ఈ చిత్రం సంబందించి హైలేట్స్ ఎంటో చెప్తూ చిరు ఓ వీడియోని అందించారు. అలాగే చిరు గ్యాంగ్ లీడర్ లోని టైటిల్ సాంగ్ అదిరిపోయే స్టేప్స్ వేశాడు. చిరుతో పాటు శ్రీకాంత్, సునీల్ కూడా డాన్స్ వేశారు.

15 నిమిషాలపాటు జరిగిన చిరు డ్యాన్స్.. అందరినీ ఎంటర్టైన్ చేసేసింది. ఈ వీడియోని చిరు అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం హైద్రాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో సినీ మా అవార్డ్స్ గ్రాండ్ గా జరిగాయి. తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు అందరు ఈ వేడుకలో పాల్గొన్నారు. 60 ఏళ్ళ వయస్సులోనూ చిరు అదిరిపోయే స్టేప్స్ వేస్తున్నాడు.

ప్రతి స్టేప్ లో అదిరిపోయే లుక్ కనబడుతుంది. పాటకు తగ్గట్లు స్టేప్స్ వేయడం చిరు వల్లే అవుతుంది తెలిసిపోతుంది. గతంలో ఎలా డ్యాన్స్ చేసేవారో.. ఇప్పటికీ అదే ప్రతిభతో అందరినీ మైమరిపించారు. ఈ వేడుకలో చిరు డాన్స్ వేస్తుంటే అందరు అనందంతో గోల గోల. ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ అయితే.. చాలా ఎగ్జైట్ అయ్యారు. చిరు డ్యాన్స్ చేస్తున్నంత సేపు.. ఆ వేడుకలో ఈలలు కేకలతో అదిరిపోయింది.

{youtube}v=DuYi3q4moyI{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -