Monday, May 5, 2025
- Advertisement -

‘కత్తి’లా రెడీ అవుతున్న చిరు

- Advertisement -

మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్. తన 150వ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న చిరు.. బరువు తగ్గించుకుని ఒకప్పటి చిరంజీవిలా స్లిమ్ గా కనిపించేందుకు వీర లెవెల్లో ట్రై చేస్తున్నారట. లాటిన్ అమెరికాలో ఫేమస్ అయిన జుంబా డ్యాన్స్ ను ప్రాక్టీస్ చేస్తూ.. ఒంట్లో కేలరీలు తగ్గించే పనిలో పడ్డారట.

బెస్ట్ ఫిట్ నెస్ డ్యాన్సుల్లో ఒకటైన జుంబాపై చిరు ఫోకస్ చేయడంతో.. కత్తి రీమేక్ సినిమాలో మళ్లీ డ్యాన్సులతో చిరు ప్రభంజనం సృష్టిస్తాడని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకుంటున్నారు. అందుకు తగ్గట్టే… స్క్రిప్టును దర్శకుడు వీవీ వినాయక్ ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ఇంకా హీరోయిన్ పై క్లారిటీ రాకున్నా.. నయనతార పేరు మాత్రం బాగా వినిపిస్తోంది.

అన్నీ కుదిరితే.. రెండు మూడు వారాల్లోనే.. సినిమాపై పూర్తి క్లారిటీ ఇచ్చే దిశగా యూనిట్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆలోపు షూటింగ్ కు చిరంజీవి కూడా పూర్తి స్థాయిలో మేక్ ఓవర్ అవుతారని.. టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -