‘వినయ విధేయ రామ’ సినిమాకు సంబంధించి దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత దానయ్యల మధ్య వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం వినయ విధేయ రామ. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఇటీవల ఈ సినిమా ఫలితంపై రామ్ చరణ్ స్పందిస్తు ఓ ప్రెస్ నోట్‌ను కూడా విడుదల చేశాడు. ఇకపై మిమ్మల్ని మెప్పించే సినిమాలే చేస్తానని లెటర్‌లో రాసుకొచ్చాడు.
ఈ సందర్బంగా రామ్ చరణ్ బయ్యర్లను అదుకునే ప్రయత్నం కూడా చేశాడట. తన పారితోషకంలో 5 కోట్లను తిరిగి ఇచ్చేశాడట రామ్ చరణ్. అదే విధాంగా దర్శక నిర్మాతలను కూడా ఎంతో కొంత ఇస్తే బాగుంటుందని చెప్పాడు రామ్ చరణ్. ఇలా చెప్పడంతో దర్శక ,నిర్మాతల మధ్య వివాదమే పెట్టాడు చరణ్. పారితోషకం తిరిగి ఇవ్వడానికి బోయపాటి ససేమిరా అనడంతో …దానయ్య, బోయపాటి ఒకరినొకరు దూషించుకునే వరకూ వెళ్లింది.15 కోట్లు పారితోషకం తీసుకుని చెత్త సినిమాను మాకు అందించారని బోయపాటిపై మండిపడ్డాడట దానయ్య. వంద కోట్లు సినిమాపై ఖర్చు పెట్టించి,బ్యాడ్ అవుట్ పుట్ ఇచ్చి ఇప్పుడు డబ్బు తిరిగివ్వనంటే ఎలా అంటూ బోయపాటిని ప్రశ్నించాడట దానయ్య. బోయపాటి కూడా దానయ్యపై అదే రేంజ్‌లో రెచ్చిపోయాడని తెలుస్తోంది.
సినిమా హిట్ అయితే మీకు లాభాలు వచ్చేవి. వాటిలో నాకు ఏమైనా వాటాను ఇచ్చేవారా ? అంటూ దానయ్యను ఎదురు ప్రశ్నించాడట బోయపాటి. మాట మాట పెరిగి ఒకరినొకరు తిట్టుకునే వరకు వెళ్లిందట మ్యాటర్. ఈ వ్యవహారం బయటికి రావడంతో రచ్చ రచ్చ అయింది. ఇక ఇందులో రామ్ చరణ్ కూడా పాత్ర కూడా ఉండటంలో సీన్‌లోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చాడట. ఈ సమస్యలో రామ్ చరణే తప్పు పట్టడాట చిరు.
సినిమా మార్కెట్ విషయాల్లో జోక్యం చేసుకోవడం వలనే ఇదంతా జరిగిందని చరణ్‌కు క్లాస్ పీకారట. అయితే బోయపాటి చేత ఎంతో కొంత పారితోషకం తిరిగి ఇప్పించడానికి అల్లు అరవింద్ కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. బోయపాటి తన పారితోషకం తిరిగి ఇస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి వివాదం ఇక్కడితో ముగుస్తుందో లేదో చూడాలి.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’