నటుడు జనసేన అధినేత,కమెడియన్ అలీ మంచి స్నేహితులని అందరికి తెలిసిందే. పవన్ నటించిన సినిమాలలో అలీకి మంచి రోల్‌ను ఇస్తుంటారు దర్శకులు. పవన్ సినిమాలు మానేసి రాజకీయాలలో బిజీగా ఉన్నారు. గత కొంతకాలంగా అలీ కూడా ఏపీ రాజకీయాల చూట్టు తిరుగుతున్నారు. అటు చంద్రబాబు,ఇటు వైఎస్ జగన్‌లతో కలిసి తిరుగుతు జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అలీ.
ఇంతకి ఆయన ఏ పార్టీలో చేరతారనేది ఎవరికి తెలియడం లేదు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పొలిటికల్ కెరీర్‌తో పాటు పవన్‌తో తనకున్న సన్నిహిత్యం గురించి చెప్పుకొచ్చాడు అలీ. పవన్ పార్టీ పెడుతున్నారని తనకు ముందే తెలుసునని, కాని ఆ విషయం ఆయన నాకు చెప్పలేదని తెలిపాడు అలీ. ఇక పార్టీ పెట్టిన తరువాత నన్ను ఆయన పార్టీలోకి పిలవలేదని,ఆ తరువాత నేను ఆయన్ను కలవలేదని చెప్పుకొచ్చాడు. మన ఫ్యామిలీలో ఎవరైన ఇబ్బంది పడుతుంటే మనం చూడగలమా. పవన్ కూడా అలాంటి వ్యక్తే.
నేను ఇబ్బంది పడుతుంటే ఆయన చూడలేకే నన్ను పార్టీలోకి పిలిచి ఉండరని అలీ అన్నాడు. నేను జగన్‌ను కలవడం అనేది సాధారణ విషయం అని ,నేను టీడీపీ మనిషినని అందరికి తెలిసిన విషయమే అని తన ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు అలీ. ఇక తనకు ఏ పార్టీ అయితే మంత్రి పదవి ఇస్తుందో ఆ పార్టీలో చేరుతానని స్పష్టం చేశాడు అలీ.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’