Wednesday, May 7, 2025
- Advertisement -

ఎమ్మెల్సీ గా మారనున్న ప్రముఖ కమెడియన్

- Advertisement -

గత కొంతకాలంగా చాలామంది సినీ ప్రముఖులు రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ముందు వరకు కొందరు ప్రముఖ నటులు జగన్ వై ఎస్ ఆర్ సి పి కి మద్దతిస్తూ కాంపెయిన్ కు కూడా చేశారు. వారిలో ప్రముఖ కమెడియన్ అలీ కూడా ఒకరు. అయితే తాజా సమాచారం ప్రకారం అలికి జగన్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ పోస్టు లభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి అలీకి ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందట. సమయం కుదరక రాజకీయాల్లోకి రాలేదని సమాచారం.

రాజకీయాల్లో ఎన్నికలలో పాల్గొనకపోయినప్పటికీ అలీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం కాంపెయిన్ ల లో మాత్రం పాల్గొన్నారు. ఇక ఈ సారి ఎన్నికలలో జగన్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ అలీ కి గిఫ్ట్ గా ఎమ్మెల్సీ పోస్ట్ ని ఇచ్చినట్లు తెలుస్తోంది. అలీ కూడా తన పదవిని సంతోషంగా స్వీకరించారట. మరి కొన్నాళ్ళలో జగన్ అలీ కి మరొక పెద్ద పోస్ట్ కూడా ఇవ్వనున్నారు అంటూ కొందరు అంటున్నారు కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. మరోవైపు అలీ పలు టీవీ షోలతో బిజీగా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -