తెలుగు ప్రముఖ కమెడియన్లలో అలీ కూడా ఒకరు. వెయ్యికిపైగా సినిమాల్లో హీరోగా, కమెడియన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అలీ ఇటీవలే జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. ఎన్నికల సమయంలో అలీ రాజకీయాల్లోకి రావడం సంచలనమే సృష్టించింది. అలీ రాజకీయల్లోకి రావడం పెద్ద విషయం కాదు కాని , ఆయన వైసీపీలోకి వెళ్లడం మాత్రం అందరినిఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అలీ స్నేహితుడు నటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
కాని అలీ జనసేనలో చేరకుండా వైసీపీలో ఎందుకు చేరాడా అని చాలామంది స్నేహాన్ని రాజకీయాలతో సినిమాలతో సంబంధం లేకుండా కొనసాగించాలని అనుకుంటున్నా. నన్ను పవన్ పార్టీలోకి పిలవలేదు, అందుకే ఆ పార్టీలోకి చేరలేదని అలీ వివరణ ఇచ్చారు. ఇక కేవలం ఎలక్షన్స్ ప్రచారంలో వైసిపి పార్టీ కోసం పని చేస్తానని అలీ చెప్పుకొచ్చారు.
- Advertisement -
జనసేనలో ఎందుకు చేరలేదో చెప్పిన అలీ
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -