గత రెండేళ్ళుగా చిరంజీవి రెండవ సారి అరంగేట్రం కోసం సినిమా పరిశ్రమతో పాటు ఫాన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ విషయంలో ఆయన లాక్కోలేక పీక్కోలేక పాట్లు పడుతున్నారు. ఇప్పటికే ఫాన్స్ కి సైతం చిరాకు తెప్పించే విధంగా చిరంజీవి జాప్యం చేస్తూ వచ్చారు. మొన్నటి వరకూ బ్రూస్ లీ విడుదల తేదీన చెప్తాం , కాదు కాదు దసరా నాడు ఫైనల్ చేసేస్తాం అన్నారు కానీ ఇప్పటి వరకూ దీనికి సంబంధించి ఎలాంటి న్యూస్ లేదు. కత్తి రీమేక్ ని పక్కన పెట్టేసారు అని కొత్త ప్రచారం మొదలైంది.
ఇప్పటికే చిరును మళ్లీ హీరోగా చూడ్డం కోసం ఏళ్లుగా ఎదురు చూస్తూ విసిగిపోయి ఉన్నారు అభిమానులు. ఫ్యాన్స్ సంగతి పక్కనబెడితే సామాన్య జనాలు కూడా చిరు రీఎంట్రీ విషయంలో చాలా ఫ్రస్టేషన్ తో ఉన్నారు. ఇండస్ట్రీ
జనాలదీ ఇదే పరిస్థితి. ఒక హీరో సినిమా గురించి ఏళ్ళ తరబడి ఊగిసలు ఆడడం చాలా చిరాకు తెప్పించే విషయం. మొన్న దసరా నాడు ఎలాగైనా అధికారికంగా కత్తి రీమేక్ సంగతి చెప్పేస్తాం అని అన్నప్పుడు హమ్మయ్య అనుకున్నారు అంతా. ఇప్పుడు మళ్ళీ ఆప్రాజేక్ట్ కాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉండడంతో జనాలు కన్ఫ్యూజన్ లు పడుతున్నారు.
చిరంజీవి నూట యాభయ్యవ సినిమా మీద ఉన్న ఆసక్తి ని అసహనంగా మార్చేస్తున్నారు, జనాల్లో వ్యతిరేక భావం కూడా వచ్చేస్తోంది. రచయితల్లో, దర్శకుల్లో కూడా ప్రస్తుతం ఆయన సినిమా మీద ఒక వ్యతిరేక భావం వచ్చేసింది. ఆయన్ని మెప్పించడం మావల్ల కాదు బాబోయ్ అంటున్నారు వారు. చిరంజేవి కోసం ప్రత్యేకంగా రాత్రుళ్ళు నిద్ర వదులుకుని మరీ రాసిన కథలు ఆయన దగ్గర రెజెక్ట్ అవుతున్నాయి కాబట్టి రీఎంట్రీ విషయంలో తీవ్రంగా ఆలోచన పక్కన పెట్టి ఎదో ఒక సినిమా తో ముందు రంగంలోకి దిగితే దాని ఫలితం బట్టి తరవాతి అడుగు వెయ్యచు అంటున్నారు సలహాలు ఇచ్చేవారు.