Wednesday, May 7, 2025
- Advertisement -

కోఆర్డినేటర్లు అంటే బ్రోకర్లే

- Advertisement -

న‌టి శ్రీరెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల‌తో టాలీవుడ్ షేక్ అవుతుంటే వివాస్ప‌ద‌ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ మ‌రో కొత్త వివాదానికి తెర‌లెపాడు.సిని పరిశ్రమలో కోర్డినేటర్ వ్యవస్థ గుట్టు విప్పారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.కోఆర్డినేటర్ అంటే ముమ్మాటికీ బ్రోకరేనని తేల్చి చెప్పారు. ఎవ‌రైనా సినిమాల‌లోకి రావ‌లంటే వాడితో కూడా కాంప్రమైజ్ కావాల్సిందేనని తెలిపారు. కొన్ని వందల మంది అమ్మాయిలను ఈ కోఆర్డినేటర్లు హ్యాండిల్ చేస్తారని చెప్పారు. అమ్మాయిల లిస్టును దర్శకులకు పంపుతార‌ని …ద‌ర్శ‌కుల‌కు న‌చ్చిన అమ్మాయిల‌ను వారు సెలెక్ట్ చేసుకుంటార‌ని మిగిలిన వారిని కోఆర్డినేటర్లు హ్యాండిల్ చేస్తారని చెప్పారు.

కాంప్రమైజ్ కు సిద్ధంగా ఉన్న 10 మంది అమ్మాయిలను ఓ కేటగిరీలో పెడతారని తెలిపారు. త‌న‌తో ఒక అమ్మాయి మాట్లాడుతు చాన్స్ కావ‌లంటే కాంప్రమైజ్ కావాలని ఓ కోఆర్డినేటర్ అడిగినట్టు చెప్పిందని అన్నారు. న‌టి శ్రీరెడ్డి చేసిన పోరాటానికి వ‌ర్మ‌ త‌న మ‌ద్ద‌తు ,అభినంద‌న‌లు తెలిపిన సంగ‌తి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -