తెలుగు చిత్ర పరిశ్రమలో ఎటువంటి సమస్య అయిన వెంటనే పరిష్కరం చూపేవాడు దర్శకరత్న దాసరి నారాయణరావు.అందుకే ఆయనను గురువుగానే అని సంభోదిస్తుంటారు.ఆయన మరణంతో టాలీవుడ్‌లో ఎవరి వారి వారిది అయింది.మొన్న ఆ మధ్య తెలుగు అసోసియేషన్ లుకలుకలు బయటపడ్డ దీనిపై ఎవరు పెద్దగా స్పందించలేదు.అయితే దాసరి బ్రతికి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని చాలామంది అభిప్రాయపడ్డారు.మరి అటువంటి వ్యక్తి ఇంట్లోనే ఆస్తుల కోసం నిత్యం గొడవలు జరుగుతున్నాయి.దాసరి కుటుంబంలోనే గొడవలు రావడంతో దాన్ని పరిష్కరించే వారు లేక ఆ కుటుంబంలో కొందరు సభ్యులు రోడ్డుకెక్కారు.
దాసరి గారి పెద్దబ్బాయి ప్రభు భార్య సుశీల తన కొడుకుతో పటు దాసరి ఇంటి ముందు బైఠాయించి ఆస్తి పంపకాల్లో తమకు న్యాయం చేయాలని ధర్నాకు దిగారు. అనారోగ్యంతో దాసరి గారు మరణించడంతో తమను ఆదుకునేవాడు కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాసరికి చెందిన ఆస్తులన్నీ ఆయన రెండో కుమారుడు అరుణ్ కుమార్ ఆధీనంలో ఉండడంతో వాటాల పంపిణీ జరగలేదని సుశీల ఆరోపిస్తున్నారు.దాసరి మరణంతో ఆయన కుటుంబంలో ఆస్తి తగదాలు ఎక్కువైయ్యాయి.కొడుకులు ఇద్దరు ఆస్తులు కోసం దాసరి పరువుని రోడ్డున పడేస్తున్నారని ఆయన అభిమానులు అందోళన చెందుతున్నారు.