బాలీవుడ్ హాట్ పెయిర్‌గా పేరు పొందారు రణ్‌వీర్ సింగ్,దీపిక పదుకొనె. వీరిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చినప్పటికి వాటిపై స్పందించలేదు ఈ జంట. ఎవరికి తెలియకుండా సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత ఎవరి సినిమాలతో వారు బిజీగా అయిపోయారు. ఆ మధ్య తమ సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చి మరి హానీమూన్‌కు వెళ్లి వచ్చారు ఈ యువజంట.
తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరు మీడియా ముందే ముద్దులతో రెచ్చిపోయారు. దీపికను గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టాడు రణ్‌వీర్.రణ్‌వీర్ ముద్దు పెడుతుంటే దీపిక కూడా తెగ మురిసిపోయింది. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు వీరి ముద్దు సీన్లను తమ కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
- Advertisement -
ముద్దులతో రెచ్చిపోయిన యువజంట
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -