మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్టు ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న దేవర చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయగా తాజాగా ఎన్టీఆర్, దేవర టీమ్ సందీప్ రెడ్డి వంగతో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఎన్టీఆర్.
దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పారు. అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఒక స్టూడియోలో పెద్ద వాటర్ పూల్ తయారుచేసాము. 200 వరకు మ్యాన్ మేడ్ వాటర్ ట్యాంక్స్ ఏర్పాటు చేశామన్నారు. 35 రోజులు అండర్ వాటర్‌లో షూట్ చేశామని ఈ సీన్స్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని చెప్పారు. ముఖ్యంగా షార్క్ తో సీన్స్ అదిరిపోతాయని చెప్పారు. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.