కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం దేవర. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషించారు.
తొలి షో నుండే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.304 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు రూ.172 కోట్ల వసూళ్లను రాబట్టగా అదే జోరును కంటిన్యూ చేస్తూ మూడు రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటే 80 శాతం రికవరీ అయ్యింది.
తెలుగు రాష్ట్రాల్లో రూ.87.69 షేర్ కలెక్షన్స్ సాధించింది. నార్త్ బెల్ట్‌లో దేవర సినిమా కలెక్షన్స్ నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి. నాలుగో రోజు కూడా థియేటర్స్ అన్నీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో కొనసాగుతుండటం విశేషం. సముద్ర తీర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మేజర్ అంశాలతో పాటు భయం లేని వారియర్స్ చుట్టూ చెప్పిన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ అయ్యింది దేవర.