కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన కొరటాల…తాజాగా మూడో సాంగ్‌ని రిలీజ్ చేశారు. ‘దావుడి..’ అంటూ సాగిన ఈ పాట లో ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఇరగదీశాడు తారక్. రామజోగయ్య శాస్త్రి తెలుగులో రాసిన ఈ పాటను తమిళంలో విఘ్నేష్ శివన్, హిందీలో కౌసర్ మునీర్, కన్నడలో వరదరాజ్ చిక్‌బల్లాపుర, మలయాళంలో మాన్‌కొంబు గోపాలకృష్ణ రాశారు.
నకష్ అజీజ్, ఆకాశ తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఆలపించారు. నకష్ అజీజ్, రమ్యా బెహ్రా తమిళ, మలయాళంలో పాటను పాడారు. మ్యూజిక్ ట్రాక్, పాటను తెరకెక్కించిన తీరు చూస్తుంటే పాన్ ఇండియా ఎక్స్‌పీరెయెన్స్ కలుగుతోంది. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్‌కు కొరియోగ్రఫీ అందిచగా జాన్వీ లుక్ అదిరిపోయింది.
నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలను పోషించారు.