కేరళ వరద బాధితులకు అండగా నిలిచేందుకు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. ఇప్పటివరకు పలువురు సెలబ్రెటీలు విరాళం అందించగా తాజాగా కోలీవుడ్ హీరో ధనుష్ ముందుకొచ్చాడు. తనవంతు సాయంతగా రూ. 25 లక్షలు విరాళంగా ప్రకటించారు.
ఇప్పటివరకు దక్షిణాదిన వివిధ పరిశ్రమల నుండి కేరళకు సాయం అందించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్, మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, సూర్య, రష్మికా వంటి స్టార్స్ విరాళాన్ని ప్రకటించారు. తాజాగా కోలీవుడ్ నుండి కేరళను ఆదుకునేందుకు ధనుష్ ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు ధనుష్.
ప్రకృతి ప్రకోపానికి కేరళలోని వయనాడ్ అతలాకుతలైన సంగతి తెలిసిందే. ప్రకృతి విధ్వంసంలో దాదాపు 300 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో గల్లంతయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేశ్ గోపి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బాధితులతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరుడు సినిమాలో నటిస్తుండగా కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు.