తమిళ సినీ స్టార్ ధనుష్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సినిమాలు ఎప్పుడూ రొటీన్ గా ఉండవు. సినిమాల మధ్య చాలా వ్యత్యాసం, విభిన్న అంశాలు ఉంటాయి. అందుకే ఆయన కేవలం తమిళ సినిమాకే పరిమితం అయిపోలేదు. ఆయన తీసిన అన్ని చిత్రాలు తెలుగు, హిందీ భాషల్లోకి డబ్బింగ్ అయ్యి మంచి వసుళ్లను సాధిస్తున్నాయి.
అయిన కొత్త సినిమా వచ్చిందటే.. కేవలం తమిళ ప్రేక్షకులే కాకుండా.. తెలుగు ప్రేక్షకులు కూడా పండగ చేసుకుంటారు. అయితే ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కర్ణన్. ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి నిర్మిస్తున్నారు. ఈ మధ్య ఈ సినిమా టీజర్ ఒకటి విడుదలైంది.దానికి మంచి స్పందన కూడా వచ్చింది.
ఈ సినిమా పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇందులో ధనుష్ లుంగీ కట్టుకుని, పెద్ద కత్తిన పట్టుకుని సహజమైన లుక్లో అభిమానులను అలరించాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రక్రియ పూర్తయింది. ధనుష్ ఈ మధ్యే తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పేశాడట. ఈ విషయాన్ని సినిమా నిర్మాత థాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఏడాది ఏప్రిలో ఈ సినిమా విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.
యంగ్ డైరక్టర్లతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న రజినీకాంత్!
మరోసారి గోపిచంద్ తో రాశిఖన్నా రోమాన్స్ !
భర్తపై మరిగే నూనె పోసిన భార్య.. కారణం ఇదే!