న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కృష్ణార్జున యుద్ధం సినిమాతో ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్న నాని, వెంటనే దేవదాస్ సినిమాతో హిట్ కొట్టాడు. నాని ప్రస్తుతం జెర్సీ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో క్రికెటర్‌గా కనిపించనున్నాడు. లేటు వయస్సులో క్రికెట్‌లోకి అడుగుపెట్టిన యువకుడిగా ఈ సినిమాలో నటిస్తున్నాడు. లేటు వయస్సులో క్రికెట్‌లోకి వచ్చి ఏం సాధించాడనేది సినిమాలో చూపించనున్నారు. అయితే ఈ సినిమాకు నాని ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట నాని. దానికి బదులుగా వచ్చే లాభాల్లో వాటా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
దీంతో నాని సినిమాకు తీసుకునే దానికన్నా ఎక్కువుగా వస్తుందని సమాచారం.సాధారణంగా నాని సినిమాకు రెండు నుంచి మూడు కోట్లు తీసుకుంటాడు. కాని లాభాల్లో వాటా తీసుకోవడం ద్వారా నానికి 10 కోట్లు వరకు వస్తుందని తెలుస్తోంది. మొత్తనికి నాని మంచి ప్లానే వేశాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.మార్చిలోగా సినిమాను పూర్తి చేసి ఏప్రిల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా శ్రద్ధాశ్రీనాథ్ నటిస్తోంది.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ