Sunday, May 4, 2025
- Advertisement -

క్రిష్ క‌థ‌తో ‘ఎన్టీఆర్’ బ‌యోపిక్‌

- Advertisement -

బాల‌కృష్ణ‌ ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమాను ఏ టైంలో మొద‌లు పెట్టాడో కాని సినిమా మాత్రం ప‌ట్టాలు ఎక్క‌డం లేదు.ద‌ర్శ‌కుడు తేజ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో సినిమా నుండి త‌ప్పుకున్నాని ప్ర‌క‌టించిన, బాల‌య్య‌తో గొడ‌వ కార‌ణంగానే సినిమా నుండి తేజ బ‌య‌టికి వ‌చ్చాడ‌ని కొంద‌రి వాద‌న‌.మొద‌ట ఈ సినిమాను ద‌ర్శ‌కుడు చంద్ర మ‌హేష్ ప‌ర్యావేక్ష‌ణ‌లో తానే ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని బాల‌య్య అనుకున్నాడు.కాని ఎన్టీఆర్ జీవిత క‌థ‌ను సరిగా చూపించ‌క‌పోతే విమ‌ర్శ‌లు వ‌స్తాయి అని, ఆ ఆలోచ‌న‌ను విర‌మించుకున్నాడు.

బాల‌కృష్ణ అభ్య‌ర్థ‌న మేర ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారని తెలుస్తుంది. ఇకపోతే ఎన్టీఆర్ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని ముందుగా ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకటి సినిమా జీవితం నుంచి రాజకీయ జీవితం వరకు. మరొక భాగంలో ఆయన సాధారణ జీవితం గురించి చూపించాలని అనుకున్నారు. బ‌యోపిక్‌లోకి క్రిష్ ఎంట్రీ ఇచ్చిన త‌రువాత సినిమా కథలో పెద్ద మార్పులు చేశార‌ని తెలుస్తుంది. రచయితలతో కూర్చొని మళ్లీ మొదటి నుంచి కథను ఎడిట్ చేస్తూ స్క్రీన్ ప్లే లో కూడా మార్పులు చేస్తున్నార‌ట‌!బ‌యోపిక్ మొత్త‌న్ని మూడు గంటల సినిమాగా సెట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక పాత్రలకు సంబంధించిన ఎంపికలు పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ మొద‌లు పెట్టాల‌ని బాల‌య్య ప్ర‌య‌త్నిస్తున్నాడు. అయితే క్రిష్ బాలీవుడ్‌లో కంగానా ర‌నౌత్ హీరోయిన్‌గా మ‌ణిక‌ర్ణిక సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు.ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజిగా ఉన్నాడు క్రిష్. బాల‌య్య మాత్రం ఈ సినిమాను వచ్చే ఎలెక్ష‌న్ల లోపు పూర్తి చేసి విడుద‌ల చేయ‌ల‌ని బాల‌కృష్ణ భావిస్తున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -