క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత దర్శకుడిగా మారి విజయవంతమైన సినిమాలు చేస్తున్న వ్యక్తి రవిబాబు. రవిబాబు సినిమాలు తీయాలన్నా.. సినిమాల్లో నటించాలన్నా భిన్నమైన పాత్రలు, కథలు ఉంటే తప్పకుండా చేస్తాడు. అలా ఎన్నో సినిమాల్లో నటించి నవ్వించాడు.. హీరోకు కోపాలు తెప్పించాడు. అతడు ప్రస్తుతం పందిపిల్లతో ‘అదిగో’ అనే ప్రయోగాత్మక సినిమా చేస్తోంది.
సినిమాలు రొటీన్‌కు భిన్నంగా ఉంటాయి. పరిమిత బడ్జెట్‌తో.. కొత్త కాన్సెప్టులతో ఆయన తీసిన సినిమాలు మంచి పేరే తెచ్చిపెట్టాయి. అవును సినిమా సీక్వెల్ తర్వాత ‘అదిగో’ సినిమా పట్టాలెక్కించాడు. ఆ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకోంది. ఈ సినిమా సమయంలో పందిపిల్లతో సందడి చేసిన రవిబాబు ఆ తర్వాత అదిగో టీజర్‌ను విడుదల చేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ ఆ సినిమా వివరాలు ప్రస్తుతం తెలియడం లేదు. ఆ సినిమాను పక్కన పెట్టేసి ఇప్పుడు కుర్ర హీరోతో సినిమా తీయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
యంగ్ హీరో రాజ్‌తరుణ్‌తో రవిబాబు సినిమా తీయడానికి వైజయంతి మూవీస్ బ్యానర్‌లో ఏర్పాట్లు కాగా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఆగిపోయింది. వీరిద్దరూ వారి వారి సినిమాలతో బిజీ కాగా ఇప్పుడు వారిద్దరూ మళ్లీ ఆ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం వినిపిస్తోంది. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయి సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.
రాజ్‌తరుణ్ సంక్రాంతికి రంగులరాట్నంతో వచ్చి పరాజయం అందుకున్నాడు. ప్రస్తుతం ‘రాజుగాడు’ ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సినిమా రూపుదిద్దుకుంటోంది. అమైరా దస్తూర్‌తో కలిసి తరుణ్ నటిస్తున్న సినిమాను లేడీ డైరెక్టర్ సంజనా రెడ్డి తీస్తున్నారు. ఈ సినిమా రాజ్‌తరుణ్ రవిబాబు సినిమాలో నటించే అవకాశం ఉంది.