Saturday, May 3, 2025
- Advertisement -

సమంతపై డాక్టర్ సంచలన కామెంట్స్!

- Advertisement -

దక్షిణాది అగ్రహీరోయిన్లలో ఒకరు సమంత. కొంతకాలంగా అనారోగ్యకారణాలతో సినిమాలకు దూరంగా ఉంటు వస్తున్నారు సామ్. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో సమంత ఇచ్చిన హెల్త్ టిప్‌పై ఓ డాక్టర్ చురకలు అంటించారు. శ్వాస‌కోస వ్యాధుల ఇన్‌ఫెక్ష‌న్ కోసం హైడ్రోజ‌న్ పెరాక్సైడ్‌ను నీటిలో క‌లుపుకుని పీల్చ‌డం ద్వారా వైర‌ల్ రుగ్మ‌త‌ల‌ను దూరం చేస్తుంద‌ని చెప్పారు.

ఇది ఖచ్చితంగా చదువురానివారు ఇచ్చే సలహా అని మండిపడ్డారు కాలేయ వ్యాధుల వైద్య నిపుణుడు డాక్ట‌ర్ ఏబీ ఫిలిప్స్ . ఇంత‌కంటే బుద్ది త‌క్కువ ప‌ని మ‌రొక‌టి ఉండ‌ద‌ని …హైడ్రోజ‌న్ పెరాక్సైడ్‌ను ఆవిరిగా తీసుకోవ‌ద్ద‌ని సూచించారు.

హైడ్రోజన్ పెరాక్సైడ్ అన్స్టేబుల్ ఓ కెమికల్.. ఇది నీరు, ఆక్సిజన్ గా మారుతుంది. అయితే.. ఈ ఆక్సిజ‌న్ అణువులుగా మారే ముందు ప‌ర‌మాణువులుగా ఉన్న‌ప్పుడు ఫ్రీ రాడిక‌ల్స్‌లా ప‌ని చేస్తాయన్నారు. అప్పటికే వైరస్ వలన దెబ్బతిన్న ఊపిరితిత్తుల లోపలి పలుచని పొరల్ని బాగా దెబ్బ తీసి, న్యుమోనియా గానీ, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ కి కానీ దారి తీస్తుందని చెప్పారు. కాబట్టి సమంత ఇచ్చిన హెల్త్ టిప్ ఖచ్చితంగా పనికిరానిదని చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -