Sunday, May 4, 2025
- Advertisement -

పూరి మార్క్…డబల్ ఇస్మార్ట్ టీజర్

- Advertisement -

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం డబల్ ఇస్మార్ట్. లైగర్ ఫ్లాప్ తర్వాత పూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుండగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇక ఇవాళ రామ్ బర్త్ డే సందర్భంగా సినిమా టీజర్‌ని రిలీజ్ చేశారు. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబల్ ఇస్మార్ట్ అంటూ రామ్ మాస్ ఎంట్రీ ఇచ్చి ఆ క్యారెక్టర్ ని చూపించారు. ఇక పవర్ ఫుల్ విలన్ గా సంజయ్ దత్ ని చూపించారు. రామ్ తెలంగాణ స్లాంగ్ లో ఇస్మార్ట్ శంకర్ స్టైల్ లో డైలాగ్స్ చెప్పి అదరగొట్టాడు. పాన్ ఇండియా వైడ్‌గా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -