Sunday, May 4, 2025
- Advertisement -

మళ్ళీ ఈగ హీరోగా కొత్త సినిమా..!

- Advertisement -

టాలివుడ్ ఇండస్ట్రీలో సక్సెస్‌కు మారు పేరుగా నిలిచిన దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, అప్పట్లో ఈగను హీరోగా చూపించి రికార్డ్ సృష్టించాడు.

బాహుబలి2 తర్వాత మళ్ళీ అదే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈగ2 సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. మన జక్కన్న ఆ మేరకు నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం. ఈగ సినిమాలో నాని, సమంత హీరో, హీరోయిన్లుగా నటించి అందర్నీ ఆకట్టుకొన్నారు. అలాగే ఈగ2 లో కూడా ఈ జంటే అలరించబోతోందని సమాచారం.

ఇది జరగడానికి కనీసం అంటే రెండు సంవత్సరాలు సమయం పట్టొచ్చు. ఎందుకంటే బాహుబలి2 సినిమానే ఇంకా ఆరంభం అవ్వలేదు. కాబట్టి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికి ఈగకు సీక్వెల్ గా సినిమా చేస్తున్నందున దీని గురించి అప్పుడే ఇండస్ట్రీలో హాట్ ఆఫ్ ది టాపిక్ అనుకుంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -