- Advertisement -
ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరక్షన్‌లో ‘అరవింద సమేత’ సినిమా చేస్తున్నాడు.ఎన్టీఆర్ పెట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్,టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోందని సమాచారం.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త వినబడుతుంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో ఇద్దరు హీరోయిన్లు ఆడిపాడనున్నారట. ఇప్పటికే ఒక హీరోయిన్‌గా పూజాను తీసుకోగా మరో హీరోయిన్ పాత్రకు తెలుగమ్మాయి ఈషా రెబ్బాను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.ఈషా రెబ్బా ఇప్పటి వరకు చిన్న హీరోల పక్కన హీరోయిన్‌గా చేసింది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పక్కన చేయడం ఈషా రెబ్బాకు ఇదే మొదటిసారి.’అంతకముందు ఆ తరువాత’,’అమి తుమి’,’బందిపోటు’ మొదలగు సినిమాలలో హీరోయిన్‌గా చేసింది.