Tuesday, May 6, 2025
- Advertisement -

ఫ్యాన్స్ వైఖరితో చిక్కుల్లో పవన్!

- Advertisement -

పవర్ స్టార్…ఈ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. అందుకే ఆయన్ని అభిమానించే వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇక ముఖ్యంగా ఏదైనా ఈవెంట్‌కి పవన్ వస్తే చాలు..ఆయన ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంత కాదు. స్టేజి మీదకు ఆయన వస్తే చాలు ఈలలు,కేరింతలతో నానా హంగామా, పవన్ సైతం తన స్పీచ్‌ని ఆపుకోవాల్సిందే. ఇక పవన్ సినిమాల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది యావరేజ్ సినిమా అయినా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ రాబట్టాల్సిందే. అది పవర్ స్టెమినా.

అయితే కొన్నిసార్లు పవన్ ఫ్యాన్స్ అతితో చాలామంది నటులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇక ఫ్యాన్స్ కి పవన్ అంటే ఎంత భక్తి అంటే ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ సైతం పొరపాటున పవన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన, సోషల్ మీడియాలో పోస్టు చేసినా ఆమెను ట్రోలింగ్ చేసిన సందర్భాలు అనేకం. అయితే పవన్ ఎన్నిసార్లు చెప్పిన ఆయన ఫ్యాన్స్‌లో ఏ మాత్రం మార్పురావడం లేదు.

తాజాగా నటి మాధవిలతను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేశారు పవన్ ఫ్యాన్స్. నచ్చావులే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటి రెండు మూడు సినిమాలు మాత్రమే చేసి ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే రీసెంట్‌గా పవన్ బర్త్ డే సందర్భంగా విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్‌డే టూ యూ మిస్టర్ పవన్ కళ్యాణ్… గాడ్ బ్లెస్ యూ అని సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది.

అంతే పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. తమ అభిమాన హీరోని ఏకవచనంతో పిలుస్తారా అంటూ ట్రోలింగ్ చేశారు. దీనిపై తనదైన శైలీలో స్పందించారు మాధవీలత. నా మనసుకు నచ్చితే ఏకవచనంతోనే పిలుస్తాను. మీరు ఏమైనా అనుకోండి. నేను మాత్రం పవన్‌ని అలాగే పిలుస్తా. ఏం పీక్కుంటారో పీక్కోండి ఘాటుగా బదులిచ్చింది. మరి దీనికి ఫ్యాన్స్ హార్ట్ అయి మరింతగా ట్రోలింగ్ చేస్తారా లేదా ఇంతటితో ఈ వివాదానికి పుల్ స్టాప్ పెడతారా వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -