మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం వినయ విధేయ రామ. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఇటీవల ఈ సినిమా ఫలితంపై రామ్ చరణ్ స్పందిస్తు ఓ ప్రెస్ నోట్‌ను కూడా విడుదల చేశాడు. ఇకపై మిమ్మల్ని మెప్పించే సినిమాలే చేస్తానని లెటర్‌లో రాసుకొచ్చాడు. ఈ సందర్బంగా రామ్ చరణ్ బయ్యర్లను అదుకునే ప్రయత్నం కూడా చేశాడట. తన పారితోషకంలో 5 కోట్లను తిరిగి ఇచ్చేశాడట రామ్ చరణ్. అదేవిధాంగా దర్శక నిర్మాతలను కూడా ఎంతో కొంత ఇస్తే బాగుంటుందని చెప్పాడు రామ్ చరణ్. దీనికి నిర్మాత డివివి దానయ్య అంగీకరించినప్పటికి , చిత్ర దర్శకుడు బోయపాటి నుంచి నో అనే సమాధానం వచ్చిందట.
దీంతో దిల్ రాజును పెద్ద మనిషిగా పెట్టి ఓ మీటింగ్ ఏర్పాటు చేశాడట నిర్మాత డివివి దానయ్య. ఈ మీటింగ్‌లో బోయపాటిని 5 కోట్లు తిరిగి ఇవ్వమని కోరాడట దానయ్య. పారితోషకం తిరిగి ఇవ్వడానికి బోయపాటి ససేమిరా అనడంతో వీరిద్దరి మధ్య మాట మాట పెరిగి పెద్ద గొడవ జరిగిందని సమాచారం. 15 కోట్లు పారితోషకం తీసుకుని చెత్త సినిమాను మాకు అందించారని బోయపాటిపై మండిపడ్డాడట దానయ్య. వంద కోట్లు సినిమాపై ఖర్చు పెట్టించి,బ్యాడ్ అవుట్ పుట్ ఇచ్చి ఇప్పుడు డబ్బు తిరిగివ్వనంటే ఎలా అంటూ బోయపాటిని ప్రశ్నించాడట దానయ్య. బోయపాటి కూడా దానయ్యపై అదే రేంజ్‌లో రెచ్చిపోయాడని తెలుస్తోంది. సినిమా హిట్ అయితే మీకు లాభాలు వచ్చేవి.
వాటిలో నాకు ఏమైనా వాటాను ఇచ్చేవారా ? అంటూ దానయ్యను ఎదురు ప్రశ్నించాడట బోయపాటి. దీంతో వీరి మధ్య మాట మాట పెరిగి బూతులు తిట్టుకునే వరకు వెళ్లిందట. ఒకనొక దశలో ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్లారని సమాచారం. దీంతో అక్కడే ఉన్న దిల్ రాజు వాళ్లని శాంతపరిచినట్లు తెలుస్తోంది. అయితే గొడవతో ఈ సమస్యకు ఎటువంటి పరిష్కారం చూపకుండానే ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. మొత్తనికి రామ్ చరణ్ ప్రెస్ నోట్ దర్శక -నిర్మాతల మధ్య ఎంతటి వివాదంలో సృష్టించిందో అని చర్చించుకుంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మరి ఈ సమస్యకు ఎటువంటి ఫలితం వస్తోందో చూడాలి.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ