కొన్ని రోజులుగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గబ్బర్ సింగ్2’ సినిమా ఏట్టకేలకు సెట్స్ పైకి రానుంది ? డిసెంబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది. అంతేకాకుండా ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. సినిమాను బాబీ నే డైరెక్ట్ చేస్తాడట.
ఇక హీరోయిన్ విషయానికి వస్తే అనిషా అంబ్రోస్ పవన్ సరసన ఈ ప్రాజెక్టులో నటిస్తుందని తెలుస్తోంది. హీరోయిన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ సమర్పిస్తుంది . ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ ఇన్ స్పిరేషన్ తో పవన్ ‘గబ్బర్ సింగ్2’ సినిమా కధ రాసుకున్నాడు. దీని డైరెక్షన్, షూటింగ్ షెడ్యూల్ అనేక మలుపులు తిరిగింది. ముందుగా సంపత్ నంది డైరెక్ట్ చేస్తాడు అన్నారు. కొంతకాలం పాటు సినిమా కోసం వేచి చూసిన నంది.., పలు కారణాలతో ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చి వేరే సినిమా చేస్తన్నాడు. ఆ తర్వాత పలువురు డైరెక్టర్ల పేర్లు విన్పించాయి. చివరకు బాబీ పేరు ప్రచారంలోకి వచ్చి ఆయనే చివరకు ఖారరైంది.