గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది గేమ్ ఛేంజర్. బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్‌ని సొంతం చేసుకుంది.
తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 7 నుండి Prime Videoలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా వెల్లడించింది. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయగా ఎస్. జె. సూర్య, శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరాం, సముద్రఖని వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు.
‘గేమ్ చేంజర్’ Prime Videoలో తెలుగు, తమిళం, కన్నడ భాషలలో డబ్ అయిన వెర్షన్లతో అందుబాటులో ఉంటుంది.