Saturday, May 3, 2025
- Advertisement -

రాజమండ్రిలో రామ్ చరణ్!

- Advertisement -

సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకురానుండగా త్వరలోనే రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటికే పలు లొకేషన్లలో సినిమా షూటింగ్ జరిగింది.

ఇక తాజా షెడ్యూల్ రాజమండ్రిలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వారంపాటు సాగే చిత్రీకరణతో మొత్తం షూటింగ్ కంప్లీట్ కానుందని సామాచారం. ఈ షెడ్యూల్‌లో ఓ పాటతో పాటు పలు సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

అక్టోబర్‌లో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తుండగా ఈ సినిమా స్టోరీ డిఫరెంట్‌గా ఉంటుందని…ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -