బొద్దుగా.. ఇంకొకరు క్యూట్‌గా కనిపిస్తున్న ఈ ఇద్దరు బాలల ఫొటో ఒకప్పటిది. వీరిలో ఒకరు స్టార్ హీరో ఉండగా మరొకరు సినిమా హీరోగా కొనసాగుతున్నాడు. ఇంతకన్నా ఎక్కువ క్లూ ఇవ్వలేం. ఈజీగా కనిపెట్టొచ్చు. ఇంతకీ గుర్తుపట్టలేదా.. ఇక మేమే చెబుతాం.
వీరిద్దరూ మెగా నటులు. అల్లు శిరీశ్ ఈ ఫొటోను షేర్ చేసుకున్నాడు. ఆ ఫొటోలో శిరీశ్‌తో పాటు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ ఉన్నాడు. వారిద్దరూ చిన్నప్పుడు కలిసి దిగిన ఫొటోను పంచుకున్నాడు. ఎందుకంటే నిన్న (మార్చి 27) రామ్‌చరణ్ జన్మదినం సందర్భంగా అల్లు శిరీశ్ శుభాకాంక్షలు చెబుతూ ఈ ఫొటోను విడుదల చేశాడు.
రామ్‌చరణ్ 33వ పుట్టిన రోజు సందర్భంగా శిరీష్ శుభాకాంక్షలు చెప్పాడు. “నాకు ఇష్టమైన కజిన్ మరియు నా వెల్ విషర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నాకు తెల్సిన తెలివైన కైండ్ పర్సన్స్ లో నువ్వు కూడా ఒకడివి. హావ్ ఏ గ్రేట్ ఇయర్ ఆర్.సి బ్రో” అంటూ ట్వీట్ చేసి విష్ చేశాడు.