నందమూరి హీరో, టీడీపీ ఎంపీ బాలకృష్ణ సినిమాలలో చెప్పినంత ఈజీగా బయట మాట్లాడలేరని అందరికి తెలిసిన విషయమే. గతంలో ఆయన చాలాసార్లు మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లాయి. తాజాగా ఆయన మరోసారి తన బలహీనతను బయటపెట్టుకున్నాడు. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 118 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్‌తో పాటు బాలయ్య కూడా వచ్చారు. ఈ సందర్భంగా బాలయ్య సినిమా గురించి మాట్లాడుతు ఏకంగా సినిమా పేరునే మార్చేశారు. సినిమా పేరు 118 అయితే బాలయ్య 189 అని చెప్పారు. ఏదో ఒక్కసారి అంటే పొరపాటున అన్నారు అనుకోవచ్చు.
కాని బాలయ్య చాలాసార్లు సినిమా పేరును 189 అని చెప్పడంతో అక్కడ ఉన్నవారందరు షాక్ అయ్యారు. కల్యాణ్ రామ్ ఒకసారి బాలయ్య దగ్గరకు వచ్చి సినిమా పేరును చెవిలో చెప్పినప్పటికి అవి ఏమి పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించాడు బాలయ్య. ఇది గమనించిన నెటిజన్లు బాలయ్యను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Advertisement -
మరోసారి నోరు జారిన బాలయ్య
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -