గతంతో పోలిస్తే ఈసారి జరిగే ఎన్నికల్లో సినిమా వాళ్ల సందడి కాస్తా ఎక్కువుగానే ఉందని చెప్పాలి. ఏపీలో ఈ హడావిడి కాస్తా ఎక్కువుగానే ఉంది. అధికార టీడీపీ పార్టీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీల్లో సినిమా వాళ్లు చేరి తమ పార్టీల తరుపున ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా మరో హీరో టీడీపీ తరుపున ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఆ హీరో మరెవ్వరో కాదు నిఖిల్. టాలీవుడ్ యంగ్ హీరోల్లో నిఖిల్ కూడా ఒకడు. వరుస హిట్లతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు నిఖిల్.
తన సినిమాల గురించి తప్ప బయట జరిగే విషయాలు గురించి పెద్దగా పట్టించుకొని నిఖిల్ ఏకంగా ఓ రాజకీయ పార్టీ తరుపున ప్రచారం చేయడం విశేషం. కర్నూలు జిల్లా డోన్ టీడీపీ అభ్యర్థి కెఈ ప్రతాప్ తరుపున యువ హీరో నిఖిల్ ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారింది. అభివృద్ధికి ఓటేయండి. మన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి. కెఈ ప్రతాప్ ను అసెంబ్లీకి పంపిచాలని కోరారు నిఖిల్. గతంలో వైసీపీ, జనసేన పార్టీలకు మద్దతుగా ట్విట్లు చేశాడు నిఖిల్. ఇలా అనేక పార్టీలకు మద్దతు తెలపడంపై నెటిజన్లు నిఖిల్‌పై మండిపడుతున్నారు.
- Advertisement -
టీడీపీ ఎన్నికల ప్రచారంలో హీరో నిఖిల్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -