హన్సిక…అల్లు అర్జున్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన దేశముదురు సినిమాతో హీరోయిన్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టింది. ఆ తరువాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినప్పటికి సరైన విజయాలు దక్కకపోవడంతో కోలీవుడ్ షిఫ్ట్ అయింది. అక్కడ వరుస సినిమాల్లో అవకాశాలు రావడంతో కోలీవుడ్‌లో నెం1 హీరోయిన్‌గా ఎదిగింది. స్టార్ హీరోలు సైతం హన్సిక కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అయితే గత కొంతకాలంగా హన్సికకు కోలీవుడ్‌లో కూడా సరైన హిట్లు లేవు.
దీంతో ఎలాంటి రోల్స్‌లో అయిన నటించడానికి రెడీ అంటోంది. తాజాగా అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాలో నెగిటివ్ రోల్లో కనిపించనుందట హన్సిక.తన పాత్ర నచ్చడంతో నెగిటివ్ రోల్లో నటిస్తుందట హన్సిక. సినిమాలో ఈ పాత్ర చాలా కీలకం కానుందని తెలుస్తోంది. ఈ సినిమా విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఒకప్పుడు అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన హన్పిక, ఇప్పుడు అదే హీరోకి విలన్‌గా నటిస్తుంది.
- Advertisement -
స్టార్ హీరోయిన్ విలన్‌గా మారిందే..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -