హైపర్ ఆది..ప్రముఖ ఈటీవీ ఛానెల్లో ప్రసారమయ్యే జబర్థస్త్ ప్రొగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఈ షో ద్వారా లైఫ్‌లైన్లోకి వచ్చిన వారిలో హైపర్ ఆది ఒకడు. ఈ షో ద్వారా ప్రేక్షకులలో మంచి ఇమేజ్ సంపాదించాడు. మొదట కంటెస్ట్‌గా వచ్చిన ఆది తరువాత కాలంలో తన టాలెంట్‌తో టీంలీడర్‌గా మారాడు. తన పంచ్ డైలాగులతో చాలామందిని అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఆది కొన్ని సమస్యలను కావాలనే కోరి తెచ్చుకుంటున్నాడని చాలామంది అంటున్నారు.
జబర్థస్త్ నుంచి చాలామంది నటులు సినిమా ఇండస్ట్రీకి వెళ్లి తమ టాటెంట్‌ను నిరుపించుకున్నారు.ధన్ రాజు, వేణు, చమ్మక్ చంద్ర ,షకలక శంకర్ వంటి వారు జబర్థస్త్ ద్వారా ఫేమస్ అయిన తరువాత సినిమాలలో నటిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి హైపర్ ఆది కూడా చేరాడు. అయితే వారి విషయంలో జరగనది,ఆది విషయంలో మాత్రమే ఓ విషయం జరుగుతుందని తెలుస్తోంది. హైపర్ ఆది పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని. ఆది డైరెక్ట్‌గానే పవన్ జనసేనకు మద్దతు తెలుపుతున్నాడు. ఆది జనసేనకు సపోర్టు చేయడంలో తప్పు లేదు కాని, ఆది తన షోలతో పాటు, ఎక్కడ కనిపించిన పవన్ భజన చేయడంతో చాలామంది ఆది తీరును తప్పుపడుతున్నారు.
ఆది ఎప్పటికప్పుడు తన పవన్‌పై ఉన్న భక్తిని చూపించడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇది చాలామందికి నచ్చడం లేదు. దీంతో ఇండస్ట్రీలోని ఓ వర్గం ఆదిని దూరం పెడుతు వస్తోంది. అతనిని తీసుకుందమని దర్శకులు చెప్పిన్నప్పటికి ఆదితో తలనొప్పి ఎందుకని వారు అతనిని తప్పిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆది సినీ కెరీర్‌పై పడే అవకాశం ఉంది. మరి ఇప్పటికి అయిన ఆది స్టేజీలపైన పవన్ భజన ఆపి తన కెరీర్‌ను చక్కదిద్దుకుంటాడో లేక, ఎప్పటి లాగే తన పంథాను కొనసాగిస్తారో చూడాలి.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ