టెలివిజన్ రంగంలో జబర్థస్త్ ఓ సంచలనమే అని చెప్పాలి. ఈ టీవీలో ప్రసారమయ్యే ఈ ప్రొగ్రామ్‌కు విపరీతమైన రేటింగ్స్ వస్తాయి. ఈ షో ద్వారా చాలా మంది నటులు ఇండస్ట్రీకి పరిచియం అయ్యారు. ఈ షో ద్వారా బాగా పాపులర్ అయిన నటులలో హైపర్ ఆది ఒకడు. ప్రస్తుతం జబర్ధస్త్ షోలో సుడిగాలి సుధీర్ తరువాత అంతటి ఫేమస్ అయింది హైపర్ ఆదినే.అతని స్కిట్‌లకు యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి అంటే అతను ఎంతలా పాపులర్ అయ్యాడో అర్థం చేసుకోవాలి. మరి అలాంటి ఆది గతకొంత కాలం నుంచి జబర్థస్త్ షోలో కనిపించడం లేదు. కారణలు తెలియలేదు
కాని రెండు నెలలు నుంచి ఆది జబర్థస్త్‌కు రావడం లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో హైపర్ ఆది మాట్లాడుతు తాను ఎందురు జబర్థస్త్‌కు రావడం లేదో తెలిపాడు. తను సినిమాల్లో బిజీగా ఉండడంతో షోకి దూరమవ్వాల్సి వచ్చిందట.అఖిల్ నటిస్తోన్న ‘మిస్టర్ మజ్ను’ సినిమాకి ముప్పై రోజులు కాల్షీట్స్ కేటాయించడం అలానే మానసిక ఒత్తిడి పెరగడంతో కొంతకాలం పాటు ‘జబర్దస్త్’ షోలో కనిపించలేదని అన్నారు. వచ్చే ఏడాది జనవరి తరువాత నుండి ‘జబర్దస్త్’ లో మళ్లీ కనిపిస్తానని వెల్లడించాడు.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ