Sunday, May 4, 2025
- Advertisement -

చరణ్ మళ్లీ బాలీవుడ్ పై కన్నేశాడా!

- Advertisement -

ఇటీవల మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా పార్క్ హయత్ లో జరిగిన పార్టీ  కి బాలీవుడ్ నుంచి కూడా అనేక మంది సినీ ప్రముఖులు హాజరయిన విషయం తెలిసిందే.

అమితాబ్ ఫ్యామిలీ, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖులతో పాటు కొంతమంది దర్శక నిర్మాతలు కూడా ముంబై నుంచి వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో చరణ్ బాలీవుడ్ ప్రయత్నాల గురించి చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇది వరకే చరణ్ బాలీవుడ్ లో ‘జంజీర్ ‘ రీమేక్ లో నటించాడు. అయితే అది అక్కడ డిజాస్టర్ గా నిలిచింది.

తెలుగులో కూడా ‘తుఫాన్’ పేరుతో విడుదలై అట్టర్ ప్లాఫ్ అయ్యింది. చరణ్ కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ ఆ సినిమా. మరి ఆ తర్వాత చరణ్ బాలీవుడ్ వైపు మళ్లీ చూడలేదు. అయితే ఆయన కలలు మాత్రం ఇంకా చాలానే ఉన్నట్టున్నాయి. చరణ్ ఓకే అంటే సినిమాలు చేయడానికి కొంతమంది దర్శకులు రెడీ అన్నారని సమాచారం. 

అయితే తొలి సారి ఒక పెద్ద సినిమాను రీమేక్ చేసి బోల్తా పడ్డ చరణ్ మళ్లీ అలాంటి ప్రయత్నం చేయకూడదని అనుకొంటున్నట్టుగా తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈ సారి ఒక చక్కటి సబ్జెక్టుతో బాలీవుడ్ తలుపు తట్టాలని భావిస్తున్నట్టుగా సమాచారం. మరి అలాంటి సబ్జెక్టును తెలుగువాళ్లే చరణ్ కోసం రెడీ చేస్తారా? లేక ఎవరైనా బాలీవుడ్ దర్శకులే చరణ్ కోసం సంసిద్ధం చేస్తారా? వేచి చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -