తన దృష్టి పూర్తిగా నటన మీదే అంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అరవైయేళ్ల వయసు వచ్చినా తనతండ్రి సినిమాల మీద దృష్టిపెట్టాడని.. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి కష్టపడుతున్నాడని.. అంత వయసు వచ్చే వరకూ తను నటించనని.. హ్యాపీగా రెస్ట్ తీసుకుంటానని చెప్పుకొచ్చిన చరణ్ ఇప్పుడుమాత్రం పూర్తిగా సినిమాల మీదే దృష్టి పెట్టినట్టుగా చెప్పాడు.
మరి ఒకవైపు చేతి నిండా వ్యాపారాలు..పోలో టీమ్ , విమానయాన సంస్థలో వాటా.. వంటి పెట్టుకుని.. ఇలా మాట్లాడుతుండటం విశేషమే.
ప్రస్తుతం తను కొన్ని వ్యాపారాలు చేస్తున్న విషయం నిజమే అయినా.. వాటన్నింటినీ వదిలించుకుని సినిమాల మీదే దృష్టిపెట్టాలని తను అనుకుంటున్నాని చరణ్ చెప్పాడు. మరి ఆ మధ్యనే వ్యాపారాలు మొదలు పెట్టి.. అప్పుడే వాటన్నింటినీ వదిలించుకోవాలని చరణ్ చెప్పడం నిజంగా విచిత్రమే. మరి దీని వెనుక కథేమిటి.. అంటే.. ఆ వ్యాపారాల వెనుక చరణ్ పై భార్య ఒత్తిడి ఉందని తెలుస్తోంది. స్వతహాగా వ్యాపారస్తుల కుటుంబం నుంచి వచ్చిన ఆమె చరణ్ పైఈ తరహా ఒత్తిడి తీసుకొచ్చిందని కొంతమంది అంటున్నారు.
భార్య కోరిక మేరకు వ్యాపారాలు ప్రారంభించిన చెర్రీ వాటిపై ఎక్కువగా కాన్సన్ ట్రేట్ చేయలేకపోతున్నాడని. .అందుకే వీలైనంతగా వాటిని వదిలించుకోవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి వ్యాపారాల విషయంలో చరణ్ దృక్పథం ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి!