ప్రముఖ ఈటీవీ ఛానెల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రొగ్రామ్ ద్వారా చాలామంది వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. చమ్మక్ చంద్ర ,షకలక శంకర్ మొదలగు వారు మొదట జబర్దస్త్ ద్వారానే ఫేమస్ అయి తరువాత సినిమాలలో బిజీగా మారారు. షకలక శంకర్ అయితే ఏకంగా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా మరో జబర్దస్త్ నటుడు హీరోగా మారుతున్నాడు.జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో మహేశ్ కూడా ఒకడు. మహనటి, రంగస్థలం వంటి హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
తాజా మహేశ్ కూడా హీరోగా మారి ఓ సినిమాలో నటిస్తున్నాడు. సినిమాకు టైటిల్‌ను నేను నా నాగార్జున అని నిర్ణయించారు.టైటిల్ లో నాగార్జున పేరు లోగోగా చేతిలో చైను పోస్టర్ లో మహేష్ సైకిల్ మీద రావడాన్ని చూడవచ్చు.తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు ఆర్బి గోపాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరి బుల్లితెర, వెండితెర మీద కమెడియన్‌గా సక్సెస్ సాధించిన మహేశ్, హీరోగా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
- Advertisement -
హీరోగా మారిన జబర్ధస్త్ మహేశ్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -