వైసీపీలో సమూల ప్రక్షాళన చేస్తున్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ఇప్పటికే అనుబంధ విభాగాలతో పాటు పలువురికి కీలక బాధ్యతలు అప్పజెప్పిన జగన్ తాజాగా మరికొంతమంది కీలక బాధ్యతలు ఇచ్చారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా ,తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. అలాగే వైసీపీ అధికార ప్రతినిధులుగా భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకరరావు, ఆర్‌కే రోజా, యాంకర్ శ్యామలను నియమించినట్లు ప్రకటించారు.
అనంతపురం జిల్లా అనంత వెంకటరామిరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా ఉషాశ్రీ చరణ్, తూర్పుగోదావరి జిల్లా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, రాజమండ్రి నగర అధ్యక్షుడిగా మార్గాని భరత్ రామ్‌ని నియమించారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఖాదర్‌బాషా, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా వెన్నపూస రవీంద్రారెడ్డిని నియమించారు.
అలాగే మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్, వాలంటీర్ విభాగం అధ్యక్షుడిగా నాగార్జునయాదవ్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా గౌతంరెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడిగా మనోహర్‌రెడ్డి, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉష, ఐటీ విభాగం అధ్యక్షుడిగా పోచం రెడ్డి సునీల్, వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా బండెల కిరణ్‌రాజు, గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడిగా నారాయణమూర్తి, టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి (ప్రైవేట్ స్కూళ్లు), ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి (గవర్నమెంట్ స్కూళ్లు)గా నియమించారు. అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలిగా చిన్నమ్మను నియమించారు జగన్.