హీరో నుంచి విలన్ గా మారి తన కెరీర్ ను సరికొత్తగా ఆవిష్కరించుకున్నాడు సీనియర్ నటుడు జగపతిబాబు. ఇప్పుడు ఈ బాబుకు తెలుగులో చాలా క్రేజ్ ఏర్పడింది. మంచి నటుడిగా ఉన్న గుర్తింపుకు తోడు.. ముక్కుసూటిగా మాట్లాడతాడు కాబట్టి ఆయన ఎవరైనా యువ కథానాయకుడికి సర్టిఫికెట్ ఇస్తే.. దాన్ని ప్రత్యేకంగా భావించాల్సిందే. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఇప్పటి యువ హీరోల్లో అందరి కంటే మీకు ఎవరిష్టం అని జగపతి బాబును అడిగితే.. అల్లు అర్జున్ అని సమాధానం ఇవ్వడం విశేషం. ఇందుకు కారణాలేంటో కూడా జగపతి వివరించాడు. ‘‘మెగా హీరో అనే ఇమేజ్ ను ఉపయోగించుకోకుండా కేవలం తన టాలెంటుతో ఎదుగుతున్నాడు అల్లు అర్జున్. అతడి నటన.. డ్యాన్స్.. కష్టపడే తత్వం నాకిష్టం. అతడి తర్వాత నాకు నాని మంచి నటుడని అనిపిస్తుంది’’ అని జగపతి బాబు చెప్పాడు. ఇప్పటిదాకా ఈ ఇద్దరితోనూ జగపతిబాబు కలిసి నటించడకపోవడం విశేషం. ఇక తన కెరీర్ గురించి.. తన ఇన్ స్పిరేషన్ గురించి జగపతిబాబు చెబుతూ.. ‘‘నా కెరీర్ ప్రస్తుతం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్టయిల్లో సాగుతోందని అనుకుంటున్నా. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన లాగే లేటు వయసులో భిన్నమైన పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఆయన వయసులో పెద్ద పాత్రలు చేసినా సరే.. హీరో లాగే ఉంటారు. వాయిస్ పరంగా.. కెరీర్ గ్రోత్ పరంగా నాకు ఆయనకు చాలా పోలికలున్నాయి’’ అని జగపతి అన్నారు.
- Advertisement -
జగపతి బాబుకి నచ్చిన హీరో ఎవరో తెలుసా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -