Wednesday, May 7, 2025
- Advertisement -

‘జనతా గ్యారేజ్‌’ ఫస్టు లుక్! సంచలనం సృష్టిస్తుంది!

- Advertisement -

ఎన్టీఆర్ తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్‌’ ఫస్టు లుక్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పుట్టిన రోజు అంటే ఈ నెల 20న ఈ ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలని నిర్ణయించారు. కాని అంతకు ముందే అంటే ఈ రోజే ‘జనతా గ్యారేజ్‌’ సంబంధించి ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ చాలా కొత్తగా ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.

ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. సమంత, నిత్యమేనన్‌ హీరోయిన్స్. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. మోహన్‌లాల్‌ కీలక పాత్రధారి. ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో చిత్రీకరణ జరుగుతోంది. ఎన్టీఆర్‌, సమంత, సితార, సురేష్‌పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించి హైదరాబాద్‌ శివార్లలో ఈసినిమా షూటింగ్ చాల వేగంగా జరుగుతోంది. నందమూరి తారకరామారావు పుట్టినరోజు అయిన మే28న ఈసినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఆగష్టు 12న విడుదల కాబోతున్న ఈ సినిమా ద్వారా జూనియర్ తన 100 కోట్ల కలెక్షన్స్ కల ఈసినిమా ద్వారా తీరుతుంది అని గంపెడు ఆశలపై ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -