చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద చేసిన ఆరోపణలకు సినీ నటులు రాజశేఖర్, జీవిత దంపతులకు నాంపల్లి మెజిస్ట్రేట్ ఏడాది పాటు జైలు శిక్ష విదించాలని తీర్పు ఇచ్చింది. 2011 లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ అమ్ముకుంటున్నారు అంటూ వీరు చేసిన కామెంట్స్ కి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011లో కేసు దాఖలు చేశారు. ఎన్నో ఏళ్లుగా నడుస్తూ వస్తున్న ఈ కేసు పై సుధీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి కోర్ట్ తీర్పు ఇచ్చింది.
నాంపల్లి 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధ రాజశేఖర్ దంపతులకు ఏడాది పాటు జైలు 5 వేలు జరిమానా విధించారు. అయితే రాజశేఖర్ దంపతులు జరిమానా చెల్లించడంతో అప్పీలుకు అవకాశం ఇస్తూ జీవితా రాజశేఖర్ లకు కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. అప్పట్లో రాజశేఖర్ చిరంజీవి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు అన్నీ సర్ధుకున్నా కూడా ఆ కేసు తీర్పు జీవిత రాజశేఖర్ లకు షాక్ ఇచ్చింది.