సినీ హీరో రాజశేఖర్ తన భార్య జీవితతో కలిసి సోమవారం ఉదయం వైసీపీ అధినేత జగన్‌ను సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. గతంలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో అక్కడ కూడా ఉండలేక బీజేపీ పార్టీలో చేరారు రాజశేఖర్ దంపతులు. వీరు అలా పార్టీలో చేరారో లేదో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన కామెంట్ చేశారు. పవన్ కల్యాణ్ అంటే మాకు గౌరవం ఉందని, కాని ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు రాజశేఖర్ దంపతులు.
తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రవాళ్లను ఇక్కడివారు కొడుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేసినట్లు ఉందని వారు తెలిపారు. కష్టల్లో ఉన్న ఏపీ ప్రజలు జగన్ నాయకత్వం కావాలని అందరు బలంగా కోరుకుంటున్నారని రాజశేఖర్ దంపతులు చెప్పుకొచ్చారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తమ వంతు సాయం చేస్తామని తెలిపారు. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో తాము కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా రాజశేఖర్ దంపతులు తెలిపారు.
- Advertisement -
వైసీపీలో చేరిన వెంటనే పవన్ కల్యాణ్‌పై సంచలన కామెంట్స్ చేసిన రాజశేఖర్ దంపతులు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -