అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ధడక్ సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో జాన్వీ నటన అద్భుతంగా ఉందని చాలామంది చెప్పడం కూడా జరిగింది. మొదటి సినిమాతోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ భామ , ప్రస్తుతం తన రెండో సినిమాలో బిజీగా ఉంది. అయితే జాన్వీ గురించి నిత్యం వార్తలు వస్తునే ఉన్నాయి.
జాన్వీ ప్రస్తుతం ధడక్ సినిమా హీరో ఇషాన్ ఖట్టర్‌తో డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు కలిసి పబ్‌లు, రెస్టారెంట్స్ వెంట తిరుగుతున్నారని బాలీవుడ్ మీడియా కథనాలు రాసింది. ఈ వార్తలు నిజమే అన్నట్లు ఈ జంట ఓ పని చేశారు. జాన్వీ, ఇషాన్ ఖట్టర్ ఇద్దరు ఒకేరకమైన టీషర్ట్ ధరించి కనిపించారు. దీంతో వీరి మధ్య ఎఫైర్ నిజమే అని బాలీవుడ్ జనాలు ఫిక్స్ అయిపోయారు.. మరి వీరి ప్రేమ ఎన్నాళ్లు సాగుతుందో చూడాలి.
- Advertisement -
శ్రీదేవి కూతురు అతనితో ప్రేమలో ఉందా…?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -